French Open : మట్టికోర్టు పోరాటాలకు నెలవైన ఫ్రెంచ్ ఓపెన్ (French Open)కు మరో ఆరు రోజులే ఉంది. ఇప్పటికే టాప్ సీడ్స్ జన్నిక్ సిన్నర్, జ్వెరెవ్, స్వియాటెక్లు తమవైన వ్యూహాలతో బిజీగా ఉండగా.. టోర్నీని మరింత ఆసక్తిగా మార్చేందుకు నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఖరారు చేశారు. మాజీ ఛాంపియన్ స్టాన్ వావ్రింకా (Stan Wawrinka), ఒకప్పటి సెమీస్ ఆడిన గేల్ మొన్ఫిల్స్కు ఆడే అవకాశమిచ్చింది. మహిళల విభాగంలో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఫ్రెంచ్ ఓపెన్ ఆడనున్నారు.
రొలాండ్ గరోస్ టోర్నమెంట్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధించిన వెటరన్ వావ్రింకా ప్రస్తుతం 125వ ర్యాంక్. కానీ, ఈ ఈవెంట్లో అతడు గుర్తుండిపోయే ప్రదర్శనలు చేసిందుకు ఈసారి నిర్వాహకులు అవకాశమిచ్చారు. 2015లో క్వార్టర్స్‌లో రోజర్ ఫెదరర్‌ను ఓడించిన ఉత్సాహంతో.. ఫైనల్లో నొవాక్ జకోవిచ్‌ను చిత్తు చేసి టైటిల్ కొల్లగొట్టాడీ స్విట్జర్లాండ్ స్టార్. గేల్ విషయానికొస్తే.. ఈ ఫ్రెంచ్ ఆటగాడు 2008లో సెమీస్ వరకూ వెళ్లాడు. కానీ, ఫెదరర్ జోరుకు నిలవలేక చేతులెత్తేశాడు.
Wildcards confirmed ✅
Gaël Monfils and Stan Wawrinka set for their final Roland-Garros appearances after receiving wildcard entries. pic.twitter.com/7pFqjKyKmy
— TNT Sports (@tntsports) May 11, 2026
వావ్రింకా, గేల్‌తో పాటు పురుషుల విభాగంలో, మహిళల విభాగలో పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కించుకున్నారు. పురుషుల వైల్డ్ కార్డ్ జాబితాలో.. నిశేష్ బసవరెడ్డి, టిటౌన్ డ్రొగుట్, హుగో గస్టన్, అర్ధర్ జీ, మోయిస్ కౌమె, ఆడమ్ వాల్టన్ ఉన్నారు. మహిళల విభాగంలో క్లారా బురెల్, సెనియా ఎఫ్రెమొవా, ఫియోనా ఫెర్రో, లియోలియా జీన్జీన్, ఎమెర్సన్ జోన్స్, సరాహ్ రకొటొమంగ, అలిసే తుబెల్లో, ఆకాశ ఉర్హోబోలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధించారు.
పురుషుల సింగిల్స్‌లో జనిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్, నొవాక్ జకోవిచ్, ఫెలిక్స్ అగర్ అలిస్సిమెలు టాప్ సీడ్స్గా పోటీ పడుతున్నారు. మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్, ఎలెనా రిబాకీనాలు టైటిల్ లక్ష్యంగా ఆడనున్నారు. మే 18 నుంచి జూన్ 7 వరకూ ఫ్రెంచ్ ఓపెన్ జరుగనుంది.