హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్ జిల్లాల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో వ్రిత్తి అగర్వాల్ విజేతగా నిలిచింది. సికింద్రాబాద్ స్విమ్మింగ్‌పూల్ వేదికగా జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో ఆదివారం వ్రిత్తి అగ్రస్థానంలో నిలిచింది.
దేవపల్లి రీతు, లిఖితగౌడ్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. పురుషుల 1500 మీటర్ల ఫ్రిస్టయిల్ విభాగంలో యశస్వి స్వర్ణం నెగ్గగా.. భువాస్, రిత్విక్ వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. విజేతలకు తెలంగాణ స్విమ్మింగ్ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, శ్యామ్‌రాజ్, ఉమేశ్ బహుమతులు ప్రదానం చేశారు.