వివాన్‌కు ఒలింపిక్ కోటా
భారత ట్రాప్ షూటర్ వివాన్ కపూర్ 2028 ఒలింపిక్స్ కోటా కైవసం చేసుకున్నాడు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గి ఈ ఘనత సాధించాడు. జైపూర్‌కు చెందిన 24 ఏండ్ల వివాన్ గురువారం జరిగిన ఫైనల్లో కొద్దిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. కువైట్‌కు చెందిన అబ్దుల్హ్మ్రాన్ అల్ ఫైహాన్తో షూటాఫ్‌లో వివాన్ ఓ క్లే టార్గెట్‌ను మిస్ చేసి 2-3తో ఓడి రజతంతో సరిపెట్టాడు. నిర్ణీత 30 ప్రయత్నాల్లో ఇద్దరూ 29 పాయింట్లతో సమంగా నిలవడంతో షూటాఫ్ నిర్వహించగా అల్ ఫైహాన్ స్వర్ణం గెలిచాడు.
- అంకుర్ కు రెండు పతకాలు
దోహా: భారత ట్రాప్ షూటర్ వివాన్ కపూర్ 2028 ఒలింపిక్స్ కోటా కైవసం చేసుకున్నాడు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గి ఈ ఘనత సాధించాడు. జైపూర్‌కు చెందిన 24 ఏండ్ల వివాన్ గురువారం జరిగిన ఫైనల్లో కొద్దిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. కువైట్‌కు చెందిన అబ్దుల్హ్మ్రాన్ అల్ ఫైహాన్తో షూటాఫ్‌లో వివాన్ ఓ క్లే టార్గెట్‌ను మిస్ చేసి 2-3తో ఓడి రజతంతో సరిపెట్టాడు. నిర్ణీత 30 ప్రయత్నాల్లో ఇద్దరూ 29 పాయింట్లతో సమంగా నిలవడంతో షూటాఫ్ నిర్వహించగా అల్ ఫైహాన్ స్వర్ణం గెలిచాడు.
కాగా, జైపాల్ మాలవీయ (10 మీ. పిస్టల్) ,నీరజ్ కుమార్ ( 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్) లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ కోటా స్థానం దక్కించుకున్న భారత షూటర్‌గా మూడో వివాన్ నిలిచాడు. మరోవైపు అంకుర్ గోయల్ 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్ ఈవెంట్లో కాంస్యం నెగ్గాడు. వ్యక్తిగత ఫైనల్లో అంకుర్ మొత్తం 583 స్కోరు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. టీమ్ ఫైనల్లో అంకుర్, అమన్‌ప్రీత్ సింగ్, రాజ్కన్వర్ తో కూడిన భారత బృందం మొత్తంగా 1727 స్కోరుతో కాంస్యం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

