Virat Kohli | కెప్టెన్ డుప్లెసిస్పై.. తన అభిప్రాయం చెప్పిన కోహ్లీ.. ఏమన్నాడంటే.
ప్రస్తుతం అత్యంత పేలవ ఫామ్‌తో అవస్థలు పడుతున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. గతేడాది ఐపీఎల్‌లోనే ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేసిన అతను.. ప్రస్తుతం సౌతాఫ్రికా లెజెండ్ ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో కొత్త కెప్టెన్‌తో తన అనుబంధాన్ని కోహ్లీ వివరించాడు. తనకు డుప్లెసిస్ పట్ల అపారమైన గౌరవం ఉందన్న కోహ్లీ.. ఒక్కోసారి తన సూచనలను డుప్లెసిస్ పట్టించుకోడని చెప్పాడు.
‘‘ఫాఫ్ సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. తను ఏం చేస్తున్నాడో చాలా స్పష్టంగా తెలిసిన ఆటగాడు అతను. మైదానంలో పూర్తి అథారిటి అతని చేతుల్లోనే ఉంటుంది’’ అని తెలిపాడు. ‘‘నేను ఇచ్చిన సూచనలు తనకు నచ్చలేదనుకోండి. ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పేస్తాడు. అలా చేయడం వల్ల కెప్టెన్ మీద మరింత గౌరవం పెరుగుతుంది’’ అని వివరించాడు.
అదే సమయంలో మరో మాజీ ప్రొటీస్ ప్లేయర్ ఏబీ డివిల్లీర్స్‌ను మిస్ అవుతున్నారా? అని అడిగితే.. చాలా మిస్ అవుతున్నానని చెప్పాడు కోహ్లీ. వచ్చే ఏడాది ఏదో ఒక రూపంలో తను మళ్లీ ఆర్సీబీతో కలిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Interview of the year! Catch Virat Kohli in a relaxed, honest and fun avatar, even as Mr. Nags tries to annoy him just like he’s done over the years. 😎🤙
Tell us what the best moment from this interview was for you, in the comments section. 👨💻#PlayBold #IPL2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/vV6MyRDyRt
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 11, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

