Virat Kohli | ఫుట్‌బాల్ ప్రపంచం మళ్లీ అదే తప్పు చేస్తోంది..! క్రీడాకారులకు రొనాల్డో స్ఫూర్తి : విరాట్ కోహ్లీ
Virat Kohli | ఫిఫా ప్రపంచకప్ 2026లో(FIFA World Cup 2026) ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పోర్చ్‌గల్ మొదటి మ్యాచ్‌లోనే అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.
Virat Kohli | ఫిఫా ప్రపంచకప్ 2026లో(FIFA World Cup 2026) ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పోర్చ్‌గల్ మొదటి మ్యాచ్‌లోనే అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు కెరీర్లో ఇదే చివరి వరల్డ్ కప్ కావడంతో (Cristiano Ronaldo) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు రొనాల్డో ఆటపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆల్ టైమ్ అత్యుత్తమ క్రీడాకారులలో ఒకరైన రోనాల్డో బుధవారం జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో పోర్చుగల్ డ్రాతో సరిపెట్టుకోవడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
143 గోల్స్ చేసినా సామార్థ్యంపై అనుమానాలు
పోర్చుగల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న 41 ఏండ్ల రొనాల్డో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోడంతో అంతర్జాతీయంగా 143 గోల్స్ చేసి రికార్డు సృష్టించిన ఈ దిగ్గజం ఆటతీరుపై క్రీడా విశ్లేషకులతో పాటు అభిమానులు అతడి ఆట తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు అతడిని జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే స్థాయి వరకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రొనాల్డో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో తన కెరీర్ చివరి దశలో దాదాపు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్న ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మూడేళ్ల క్రితం ప్రపంచానికి చెప్పిన మాటలు ఈ సందర్భంగా ప్రాధాన్యం సంచరించుకున్నాయి.
ఫుట్‌బాల్ ప్రపంచం మళ్లీ అదే తప్పు చేస్తోంది
సరిగ్గా ఇలాంటి విమర్శలనే తన కెరీర్లో ఎదుర్కొన్న కోహ్లీ రొనాల్డో విషయంలో ప్రపంచాన్ని హెచ్చరిస్తూ పలు సందర్భాల్లో తన మద్దతును చాటుకున్నాడు. రొనాల్డోనో విమర్శిస్తూ ఫుట్‌బాల్ ప్రపంచం మళ్లీ అదే తప్పు చేస్తోందన్నారు. 2022లో ఖతార్ ప్రపంచకప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించినప్పుడు రొనాల్డో తీవ్ర నిరాశలో కూరుకుపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు కోహ్లీ స్ఫూర్తిదాయక సందేశాన్ని పోస్ట్ చేశాడు. డియర్ రొనాల్డో ఏ ట్రోఫీ లేదా టైటిల్ కూడా ఈ క్రీడకు మీరు చేసిన సేవను, ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులపై మీరు చూపిన ప్రభావాన్ని తగ్గించలేదు.
ఆటపై మీకున్న మమకారం, జనం మిమ్మల్ని చూసినప్పుడు పొందే అనుభూతిని ఏ టైటిల్ వివరించలేద్నారు. ప్రతిసారీ తన పూర్తిస్థాయిలో హృదయంతో ఆడే వ్యక్తికి ఇది నిజమైన ఆశీర్వాదం. ప్రపంచంలోని క్రీడాకారులందరికీ మీరు నిజమైన స్ఫూర్తి. నా దృష్టిలో మీరే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ అని కోహ్లీ పేర్కొన్నాడు. నలువైపుల ఉంచి విమర్శల దాడి కొనసాగుతుండంతో కింగ్ కోహ్లీ ఘాటుగానే స్పందించాడు.
రొనాల్డో రాణించకపోవడానికి అతడి సామర్థ్యం తగ్గడం కాదని, వేగవంతమైన యూరోపియన్ లీగ్‌లలో ఆడే సహచరులతో సరైన సమన్వయం లేకపోవడమేనని తన మద్దతును చాటిచెప్పాడు. కాగా, రొనాల్డో, కోహ్లీ ఇద్దరూ తమ తమ క్రీడల్లో దిగ్గజాలే.. వారి కెరీర్లో ఇలాంటి విమర్శలను ఎదుర్కొని, తమ ఆటతోనే సమాధానం చెప్పినవారే. కోహ్లీ బ్యాట్‌తో చెలరేగి పరుగుల వరద సృష్టించి విమర్శకుల నోళ్లు మూయించాడో అలాగే రొనాల్డో కూడా రాణించి పోర్చ్‌గల్‌కు వరల్డ్ కప్ అందివ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

