NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
NZvIND: కివీస్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్, భారత బౌలర్ గుర్నూర్ బ్రార్ మధ్య ఇవాళ మాటల యుద్ధం సాగింది. నాలుగో వన్డేలో ఈ ఘటన జరిగింది. సీఫర్ట్ ఔటైన సమయంలో బ్రార్ అతని మీదకు వెళ్లాడు. ఆ సమయంలో కోహ్లీ జోక్యం చేసుకుని భారత బౌలర్‌ను నియంత్రించాడు.
మౌంట్ మౌంగనుయి: కివీస్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్, భారత బౌలర్ గుర్నూర్ బ్రార్ మధ్య ఇవాళ మాటల యుద్ధం సాగింది. నాలుగో వన్డే(NZvIND)లో ఈ ఘటన జరిగింది. సీఫర్ట్ ఔటైన సమయంలో బ్రార్ అతని మీదకు వెళ్లాడు. ఆ సమయంలో కోహ్లీ జోక్యం చేసుకుని భారత బౌలర్‌ను నియంత్రించాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మౌంట్ మౌంగనుయిలో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచిన ఇండియా తొలుత ఆతిథ్య దేశానికి బ్యాటింగ్ ఇచ్చింది. అయితే ఓపెనర్ సీఫర్ట్ దూకుడుగా ఆడాడు. అతను 48 బంతుల్లో 58 రన్స్ చేశాడు. గుర్నూర్ బ్రార్ వేసిన ఓ ఓవర్లో సీఫర్ట్ 14 రన్స్ కొట్టాడు. ఆ టైంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత 12వ ఓవర్లో షార్ట్‌పిచ్ బంతిపై సీఫర్ట్ ఫుల్ షాట్ ఆడాడు. బంతి గాలిలోకి ఎగరగా, దాన్ని కీపర్ ఇషాన్ అందుకున్నాడు. అయితే ఔటౌ పెవిలియన్‌కు వెళ్తున్న సీఫర్ట్ మీదుకు బ్రార్ దూసుకెళ్లాడు. ఇక అక్కడే ఉన్న కోహ్లీ అతన్ని నివారించాడు. పరిస్థితులను శాంతింపచేసే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 333 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది.
A FIERY SEND-OFF! 😤
Gurnoor Brar gets Tim Seifert, and has a few words to go with it! 🔥
Watch the HERO VIDA India Tour of New Zealand 4th ODI LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha & Sony LIV.
#SonySportsNetwork #SonyVizhaw #SonyLIV #NZvIND https://t.co/Y0VE4rtOTc
— Sony Sports Network (@SonySportsNetwk) November 13, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

