కోహ్లీ @ 150 మిలియన్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌కు ఫుల్ క్రేజ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని 150 మిలియన్ల (15 కోట్లు) మంది ఫాలో అవుతున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు కోహ్లీనే. అంతేగాక ఆసియా ఖండం నుంచి సైతం ఈ ఫీట్ అందుకున్న తొలి వ్యక్తి అతడే. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే క్రీడాకారుల్లో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 337 మిలియన్ల ఫాలోవర్లతో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. మెస్సీ (260 మిలియన్లు), నెయ్మర్ (160 మిలియన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్ (43.4 మిలియన్లు), ఫేస్బుక్ (48 మిలియన్లు)లో కూడా కోహ్లీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ ఒక స్పాన్సర్ పోస్టు ద్వారా రూ. 5 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

