ముంబై: ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో భారీ సెంచరీతో విజృంభించిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తన డ్యాన్స్ మూమెంట్స్‌తో అభిమానులను అలరించాడు. టెస్టు సిరీస్ విజయం అనంతరం రిలాక్స్ అవుతున్న విరాట్.. నార్వేకు చెందిన ‘ది క్విక్ ైస్టెల్’ గ్రూప్‌తో కలిసి బాలీవుడ్ పాటకు కాలు కదిపాడు. బ్యాట్ చేతపట్టి కోహ్లీ చేసిన క్యూట్ స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ ఎవర్గ్రీన్ హిట్స్ ‘తెర కాలా చష్మా’, ‘బార్ బార్ దేఖో’ వంటి పాటల ద్వారా ఫేమస్ అయిన ఈ బృందం మంగళవారం కోహ్లీని కలిసింది. ఈ సందర్భంగా తీసుకున్న చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన కోహ్లీ.. ‘ఈ రోజు నేను ఎవరిని కలిశానో చెప్పుకోండి చూద్దాం!’ అని రాసుకొచ్చాడు.