Virat Kohli | రాముడిలా విల్లు ఎక్కుపెట్టిన కోహ్లీ.. వీడియో వైరల్
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో తెలిసిందే. ప్రత్యర్థులను కవ్విస్తూ.. వికెట్ పడగానే సింహ గర్జన చేసే విరాట్ అప్పుడప్పుడు అభిమానులను ఫన్నీ మూమెంట్స్‌తో నవ్విస్తుంటాడు. తాజాగా దక్షిణాఫ్రికా(South Africa)తో కేప్‌టౌన్(Kape Town)లో...
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో తెలిసిందే. ప్రత్యర్థులను కవ్విస్తూ.. వికెట్ పడగానే సింహ గర్జన చేసే విరాట్ అప్పుడప్పుడు అభిమానులను ఫన్నీ మూమెంట్స్‌తో నవ్విస్తుంటాడు. తాజాగా దక్షిణాఫ్రికా(South Africa)తో కేప్‌టౌన్(Kape Town)లో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ ఫ్యాన్స్‌ను అలరించాడు. అయితే.. ఈసారి అతడు భారతీయుల ఆరాధ్య దైవమైన రాముడిలా అభినయం ప్రదర్శించాడు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో బాలీవుడ్ సినిమా ‘ఆదిపురుష్'(Adipurush) సినిమాలోని ‘రామ్ సియా రామ్'(Ram Sia Ram) పాట ప్లే చేశారు. ఆ పాట చెవినపడగానే విరాట్ బాణం ఎక్కుపెట్టినట్టు ఫోజు ఇచ్చాడు. అనంతరం చేతులు జోడించి సవినయంగా అందరికీ నమస్కరించాడు.
Virat Kohli when Ram siya Ram bhajan was played❤️. pic.twitter.com/FRr67ToLHg
— Kohlified. (@123perthclassic) January 3, 2024
కోహ్లీ అలా ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయడం కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్(Siraj) నిప్పులు చెరిగాడు. అతడు 6 వికెట్లతో చెలరేగడంతో సఫారీ జట్టు 55 పరుగులకే ఆలౌటయ్యింది.

ప్రపంచంలోని గొప్ప క్రికెటర్లలో ఒకడైన విరాట్ 2023లో పరుగుల వరద పారించాడు. ఐపీఎల్‌తో మొదలైన అతడి పరుగుల దాహం.. ఆసియా కప్‌లో తారా స్థాయికి చేరింది. ఇక వన్డే వరల్డ్‌కప్‌లో అయితే.. కోహ్లీ విశ్వరూపమే చూపించాడు. బౌలర్లను ఉతికారేస్తూ పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. దక్షిణాఫ్రికాపై ఈడెన్ గార్డెన్స్‌లో సూపర్ సెంచరీ బాదిన కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సార్లు మూడంకెల స్కోర్ చేసిన సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. కెరీర్లోనే భీకర ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ బ్యాటర్ తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి ఎగబాకాడు.
ఇవి కూడా చదవండి
- DK Shivakumar | ఏడు నెలలుగా విపక్ష నేతను ఎన్నుకోలేని బీజేపీ : కాషాయ పార్టీపై డీకే శివకుమార్ ఫైర్
- Peerjadiguda | పీర్జాదిగూడలో వైద్యం వికటించి వ్యక్తి మృతి
- YS Sharmila | ఏపీ సీఎం జగన్‌ను కలిసిన షర్మిల.. 25 నిమిషాల పాటు భేటీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

