Virat Kohli-Anushka Sharma | మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క.. బుల్లి కోహ్లీ ఆగయా..
Virat Kohli-Anushka Sharma | విరుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
Virat Kohli-Anushka Sharma | విరుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. బుల్లి కోహ్లీకి ‘అకాయ్’ అని పేరు పెట్టినట్టు ప్రకటనలో తెలిపింది. ఈనెల 15న అనుష్క.. అకాయ్‌కు జన్మనిచ్చింది. అనుష్క శర్మ పెట్టిన పోస్టుతో ఇంగ్లండ్ సిరీస్ నుంచి తప్పుకున్న కోహ్లీకి ఏమైంది..? అసలెందుకు అతడు ఆడటం లేదు..? కోహ్లీ తల్లికి బాగోలేదా..? వాళ్ల ఇంట్లో అంతా ఓకేనా..? వంటి ప్రశ్నలకు సమాధానం దొరికినట్టైంది.
అనుష్క గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా దీనిపై అటు విరాట్ గానీ ఇటు అనుష్క గానీ స్పందించలేదు. ఇటీవలే కోహ్లీ మిత్రుడు ఏబీ డివిలియర్స్ కూడా అనుష్క ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించి ఆ తర్వాత వాళ్ల గోప్యతకు భంగం కలిగించినందుకు యూటర్న్ తీసుకున్నాడు. దీంతో అసలు కోహ్లీకి ఏమైంది..? ఎందుకు ఆడటం లేదు..? అన్న అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఈ దంపతులు తాజాగా చేసిన ప్రకటనలో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కోహ్లీ – అనుష్కలకు తొలి సంతానం ‘వామిక’ అన్న సంగతి తెలిసిందే.
తమకు కొడుకు పుట్టిన విషయాన్ని తెలియజేస్తూ.. ‘ఫిబ్రవరి 15వ తేదీన మాకు బాబు పుట్టాడు. వామిక తమ్ముడు అకాయ్‌కు స్వాగతం పలుకుతున్నాం. మాకు మీ ఆశీర్వాదం కావాలి. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం..’ అని విరుష్క దంపతులు ప్రకటనలో వెల్లడించారు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన కోహ్లీ.. హైదరాబాద్ టెస్టు ఆడేందుకు రెండ్రోజుల ముందు వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత రాజ్‌కోట్ టెస్టుకు ముందు సెలక్టర్లకు తాను మిగతా టెస్టులకూ అందుబాటులో ఉండనని తెలిపాడు. కోహ్లీ లేకుండానే ఈ సిరీస్‌లో భారత్.. 2-1 ఆధిక్యం సాధించడం విశేషం.
అకాయ్ అంటే..
కోహ్లీ – అనుష్కలు తమ వారసుడికి ‘అకాయ్’ అని పేరు పెట్టడంతో నెటిజన్లు ఈ పేరుకు అర్థం ఏమిటా..? అని గూగుల్ తల్లిని అడుగుతున్నారు. అకాయ్ అంటే ‘ప్రకాశించే చంద్రుడు’ అని అర్థం. కాగా వామిక పుట్టినప్పుడు కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయగా తాజాగా కొడుకు పుట్టిన విషయాన్ని అనుష్క శర్మ వెల్లడించడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

