హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ అథ్లెట్ బానోత్ వినోద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ స్టార్ స్ప్రింటర్ యర్రాజీ జ్యోతి ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించారు. నేషనల్ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్ పోటీల్లో వినోద్ 800 మీటర్ల ఈవెంట్లో ఏషియాడ్ బెర్తు అందుకున్నాడు. భువనేశ్వర్‌లో బుధవారం జరిగిన హీట్స్‌లో అతను 1 నిమిషం 47.66 సెకండ్లలో రేసును పూర్తి చేసి ఆసియా గేమ్స్ క్వాలిఫికేషన్ మార్కు (1:48.80సె)ను అందుకున్నాడు. మరోవైపు మోకాలి గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత బరిలోకి దిగిన 26 ఏండ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ తొలి హీట్ రేసును 13.14 సెకండ్లలో ముగించింది. క్వాలిఫయింగ్ టైమింగ్ (13.34 సె.) మార్కు అధిగమించి మరోసారి ఆసియా గేమ్స్‌లో పోటీకి రెడీ అయింది