హైదరాబాద్: గాయం కారణంగా ఐపీఎల్-17కు దూరమైన శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ స్థానాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ భర్తీ చేసింది. హసరంగ స్థానంలో లంక యువ సంచలనం విజయ్‌కాంత్ వియస్కాంత్‌ను జట్టులోకి తీసుకుంది. మణికట్టు స్పిన్నర్ అయిన ఈ కుర్రాడు.. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. 33 టీ20 మ్యాచ్‌లలో 6.76 ఎకానమీతో 42 వికెట్లు సొంతం చేసుకున్న అతడిని రూ. 50 లక్షల కనీస ధరతో హైదరాబాద్ సొంతం చేసుకుంది.