Vijay Shankar: పాండ్యా బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన శంకర్.. వీడియో
Vijay Shankar: విజయ్ శంకర్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చెలరేగిపోయాడు. పాండ్యా బౌలింగ్‌లో అతను ఆ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపాడు.
ఇండోర్: ఆల్‌రౌండర్ విజయ్ శంకర్(Vijay Shankar).. హ్యాట్రిక్ సిక్సర్లతో సత్తా చాటాడు. తన పవర్ హిట్టింగ్ ఏంటో చూపించాడు. మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అతను భారీ షాట్లు బాదాడు. ఇండోర్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో.. చెన్నై జట్టు ప్లేయర్ విజయ్ శంకర్.. భీకర హిట్టింగ్ చేశాడు. గుజరాత్ ప్లేయర్ పాండ్యా బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ 2025 వేలంలో చెన్నై జట్టు అతన్ని 1.20 కోట్లకు సొంతం చేసుకున్నది. విజయ్ శంకర్ భీకర రూపంలో ఉన్నట్లు సీఎస్కే జట్టు ట్విట్టర్లో ఆ వీడియోను పోస్టు చేసింది.
6️⃣.6️⃣.6️⃣!🥳🔥
Vijay in BEAST MODE! #SMAT #WhistlePodu@vijayshankar260
pic.twitter.com/6JFc0osJEy— Chennai Super Kings (@ChennaiIPL) November 27, 2024
విజయ్ శంకర్ ఇండియా తరపున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. చివరిసారి అతను 2019లో వెస్టిండీస్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో పాండ్యా నేతృత్వంలోని బరోడా జట్టు.. 5 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 74 రన్స్ చేశాడు. దాంట్లో ఆరు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్లో పాండ్యా కొత్త రికార్డును నమోదు చేశాడు. ఆ ఫార్మాట్లో 5వేల పరుగులు, 100 పైగా వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు. పాండ్యా ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో 5067 రన్స్ చేశాడు. 180 వికెట్లు తీసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

