Tokyo Olympics: మ్యాచ్‌కు ముందు ప్లేయర్‌ను లాగిపెట్టి కొట్టిన కోచ్.. షాకింగ్ వీడియో

టోక్యో: ఒలింపిక్స్‌లో ఓ జూడో మ్యాచ్‌లో తలపడటానికి జర్మనీకి చెందిన జూడో స్టార్ మార్టినా ట్రాడోస్ కోచ్‌తో కలిసి వస్తోంది. ఆమె రింగ్‌లోకి వెళ్లే ముందు తన వెంటే ఉన్న కోచ్ రెండు చేతులతో కాలర్ పట్టుకొని లాగి రెండు చెంపలపై వాయించాడు. ఇది చూసిన వాళ్లంతా షాక్ తిన్నారు. కెమెరాల ముందే ఈ కోచ్ ఏంటి ఇలా చేస్తున్నాడని అంతా ముక్కున వేలేసుకున్నారు. అయితే ఆ చెంపదెబ్బలు తిన్న మార్టినా మాత్రం ఇది కామనే అని చెప్పడం విశేషం. ఫైట్‌కు ముందు కోచ్ ఇలా చేయడం ఆనవాయితీ అని ఆమె చెప్పడం మరింత షాక్‌కు గురి చేసింది. అది కూడా తాను చెప్పడం వల్లే కోచ్ అలా చేస్తున్నాడని మార్టినా చెప్పింది. ఫైట్‌కు ముందు తాను యాక్టివ్‌గా ఉండటానికి ఇది తనకు అవసరం అని ఆమె అనడం విశేషం. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు కోచ్‌పై మండిపడుతున్నారు.
A czo tu się odpoliczkowało w ogóle?! pic.twitter.com/mX2r9rMMTA
— Mischa von Jadczak (@michaljadczak) July 27, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

