IPL 2023 : కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. కోల్‌కతా తరఫున సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై చెలరేగిన అతను 49 బంతుల్లోనే శతకం సాధించాడు. దాంతో, కోల్‌కతా తరఫున మూడంకెల స్కోర్ చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
Worth the wait! 💜@venkateshiyer | @Bazmccullum | #AmiKKR pic.twitter.com/YCYgXS5qr9
— KolkataKnightRiders (@KKRiders) April 16, 2023
ఐపీఎల్ తొలి సీజన్(2008)లో మొదటి మ్యాచ్‌లోనే బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum) శతకంతో చెలరేగాడు. అతడి తర్వాత ఇప్పటి వరకు కోల్‌కతా బ్యాటర్లు సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడిన అయ్యర్ 51 బంతుల్లోనే 104 రన్స్ చేశాడు. ఆ తర్వాత రిమెడిత్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి ఔటయ్యాడు.
📸 📸
Take a bow, @venkateshiyer 🙌
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR | @KKRiders pic.twitter.com/sYx4kSnRdT
— IndianPremierLeague (@IPL) April 16, 2023
16వ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా కోల్‌కతాకు శుభారంభం ఇస్తున్న వెంకటేశ్ అయ్యర్ ముంబైపై దంచి కొట్టాడు. ఈ సీజన్లో సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. మొత్తంగా చూస్తే.. ఐపీఎల్లో ఇది 77వ శతకం. సన్‌రైజర్స్ ఆటగాడు హ్యారీ బ్రూక్(Harry Brook) ఈ సీజన్లో మొదటి సెంచరీ బాదాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెలరేగిన అతను 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 100 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ 23 పరుగుల తేడాతో గెలిచింది.