న్యూఢిల్లీ: రానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడటం అనుమానాస్పదంగా మారింది. ఐపీఎల్లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్..మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో మెగాటోర్నీలో అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ లేమితో బాధపడుతున్న వరుణ్ స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే కోల్‌కతా తరఫున 13 మ్యాచ్‌లాడిన ఈ తమిళనాడు స్పిన్నర్..15 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.