హైదరాబాద్, ఆట ప్రతినిధి: తమిళనాడు వేదికగా జరుగుతున్న జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర లిఫ్టర్ మహేశ్ వైష్ణవి సత్తాచాటింది. మహిళల 84 కిలోల కేటగిరీలో బరిలోకి దిగిన వైష్ణవి బెంచ్ప్రెస్లో రజతం, డెడ్లిఫ్ట్లో కాంస్యం సొంతం చేసుకుంది.
ఓవరాల్గా మరో కాంస్యాన్ని దక్కించుకుని అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో వైష్ణవి పతకాలు ఖాతాలో వేసుకుని ఔరా అనిపించింది.