Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంటే బ్యాటింగ్ మెరుపులే గుర్తుకొస్తాయి. ఎంతటి బౌలర్‌నైనా భయపెడుతూ అలవోకగా సిక్సర్లు బాదే ఈ చిచ్చరపిడుగు.. ఈసారిబంతితోనూ చెలరేగాడు. విధ్వంసక బ్యాటర్‌నే కాదు అప్పుడప్పుడు వికెట్లూ తీయలను అని నిరూపించాడీ 15 ఏళ్ల కుర్రాడు. దులీప్ ట్రోఫీలో నాలుగు బంతుల్లోనే ఇద్దరిని ఔట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు వైభవ్.
ఐపీఎల్.. ఆపై అంతర్జాతీయ టీ20ల్లో తుఫాన్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్న వైభవ్ సూర్యవంశీ తనలోని మరోకోణాన్ని పరిచయం చేశాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం.. బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడే వైభవ్ ఈసారి బంతితో విజృంభించాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌కు ఆడుతున్న అతడు రెండు వికెట్లు పడగొట్టాడు.
Vaibhav Sooryavanshi provides Double Delight ✌️
Picks up 2⃣ wickets in the over. 2 excellent catches as well. 🙌
North East Zone are 79/7 in the 2nd innings after following on.
Scorecard ▶️ https://t.co/XJFhfvvTIU#DuleepTrophy pic.twitter.com/NnYbBPnrja
— BCCI Domestic (@BCCIdomestic) August 25, 2026
ఎడమచేతివాటం స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన ఈ కుర్రాడు.. కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే ఇద్దరిని పెవిలియన్ పంపడం విశేషం. ఈస్ట్ జోన్ వైస్ కెప్ట్‌న్‌గా బ్యాట్‌తో ప్రభావం చూపలేకపోయిన ఈ కుర్రాడు బంతితో రాణించి తన హోదాకు న్యాయం చేశాడు. వైభవ్ తిప్పేయడంతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టు కష్టాల్లో పడింది.
తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ ఈస్ట్ జోన్ 110కే ఆలౌటవ్వగా.. అనంతరం 467 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే.. ఓపెనర్‌గా దిగిన వైభవ్ 8 రన్స్‌తో నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంతి అందుకున్న అతడు.. కిషన్ లింగ్డోహ్(25), ఇమ్లివటి లెమ్టూర్(4)లను ఔట్ చేశాడు వైభవ్.