గౌహతి: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) తన పవర్ స్ట్రోక్స్‌తో సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంబేలెత్తించాడు. బుమ్రా వేసిన తొలి బంతినే అతను సిక్సర్‌గా కొట్టాడు. అనుకున్నట్లే యువ బ్యాటర్ వైభవ్ తన స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో 27 రన్స్ తేడాతో ముంబైపై ఆర్ఆర్ జట్టు గెలిచింది. సూర్యవంశీ కేవలం 14 బంతుల్లో 39 రన్స్ చేశాడు. దాంట్లో అయిదు సిక్సర్లు, ఓ ఫోర్ ఉన్నాయి.
వర్షం వల్ల 11 ఓవర్లకు కుదిరించిన ఈ మ్యాచ్‌లో వైభవ్, జైస్వాల్ తొలి వికెట్‌కు 80 రన్స్ జోడించారు. ఫస్ట్ ఓవర్లో జైస్వాల్ 24 రన్స్ చేయగా, ఇక రెండో ఓవర్లో తొలి బంతినే సూర్యవంశీ సిక్సర్‌గా మలిచాడు. మేటి బౌలర్ బుమ్రా ఆ బంతిని 131 కిలోమీటర్ల వేగంతో వేశాడు. బుమ్రాను తొలిసారి ఎదుర్కొన్న వైభవ్ నిర్భయంగా ఆ షాట్ ఆడాడు. మిడిల్ అండ్ లెగ్ లెన్త్‌లో పడిన ఆ బంతిని అవలీలగా మిడాన్ మీదుగా సిక్సర్ కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో సూర్యవంశీ రెండు సిక్సర్లు బాదడం గమనార్హం. ఇక బౌల్ట్, శార్దూల్ బౌలింగ్‌లో కూడా సిక్సర్లు దంచాడు. ఫస్ట్ బాల్నే సిక్సర్‌గా కొట్టిన తర్వాత బుమ్రా నవ్వుకుంటూ వెనుదిగిరిపోయాడు. ఇక ఆ ఓవర్లో నాలుగో బంతిని అతను బ్యాక్వర్డ్ లెగ్ స్క్వేర్ మీదుగా సిక్సర్ బాదాడు. బుమ్రా వేసిన తొలి బంతినే వైభవ్ సిక్సర్ కొట్టడం వల్ల తనపై వత్తిడి తగ్గినట్లు జైస్వాల్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 32 బంతుల్లో 77 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. 11 ఓవర్లలో ఆర్ఆర్ జట్టు 3 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేయగా, ఆ లక్ష్య చేధనలో ముంబై జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 రన్స్ మాత్రమే చేసింది.
Bumrah to Vaibhav
Boom for 6:
RR vs MI Match!
Wtf he did tji 3 ball 2 six to bumrah pic.twitter.com/924V9meRjg— voice of vision (@voiceofvision3) April 7, 2026