గౌహతి: ఇదేమీ చిన్నపిల్లల ఆటకాదు. 15 ఏళ్లే కదా అనుకుంటే పొరపాటే. ఐపీఎల్లో యువ సెన్షేషన్ .. వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఇరగదీస్తున్నాడు. భారీ షాట్లతో అలవోకగా మేటి బౌలర్లను ఆడేస్తున్నాడు. పిల్లవాడిని కాదు.. పిడుగునే అన్నట్లు విరుచుకుపడుతున్నాడు. టీ20 క్రికెట్ లీగ్‌లో ఓ కొత్త తరహా ఆటశైలికి తెరలేపుతున్నాడు. ఐపీఎల్లో భాగంగా బెంగుళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన పవర్ స్ట్రోక్స్‌తో దుమ్మురేపాడు. బంతి ఎటు వేసినా.. దాన్ని బౌండరీ దాటించేశాడు. మేటి బౌలర్లను కూడా ఈజీగా ఆడేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్ కొట్టాడు వైభవ్. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ భువనేశ్వర్, హేజిల్‌వుడ్‌ను చాలా టెక్నిక్‌తో ఎదుర్కొన్నాడు. ఆరంభంలోనే భువనేశ్వర్ వేసిన యార్కర్‌ను చాలా సమయోచితంగా ఎదుర్కొన్నాడు. కేవలం హిట్టింగ్ మాత్రమే కాదు.. టెక్నికల్ గేమ్ కూడా తన వద్ద ఉందన్న రీతిలో బ్యాటింగ్ ప్రజెంట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా మేటి బౌలర్ హేజిల్‌వుడ్‌ను కూడా ఎదుర్కొన్న తీరు హర్షణీయమే. వాస్తవానికి గాయంతో గ్యాప్ తీసుకున్న హేజిల్‌వుడ్.. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడాడు. జైస్వాల్‌ను అతను చాలా తెలివిగా ఔట్ చేశాడు. ఇక అదే తరహా బంతిని వైభవ్‌కు వేశాడు. కానీ సూర్యవంశీ మాత్రం తన ట్యాలెంట్ ఏంటో చూపించాడు.
First ball vs Jasprit Bumrah – 6️⃣
First ball vs Trent Boult – 6️⃣
First ball vs Bhuvneshwar Kumar – 4️⃣
First ball vs Josh Hazlewood – 4️⃣That’s Vaibhav Sooryavanshi for you 🫡#TATAIPL | #KhelBindaas | @rajasthanroyals pic.twitter.com/wYzmQnua4k
— IndianPremierLeague (@IPL) April 11, 2026
వైభవ్ బ్యాక్‌లిఫ్ట్ హిట్టింగ్ ఓ ప్రత్యేక ఆర్ట్‌లా ఉంది. బ్యాట్‌ను లిఫ్ట్ చేయడమే కాదు.. రిస్ట్ కూడా అతను ఈజీగా తిప్పేస్తున్నాడు. ఇక బ్యాట్ ఫ్రీ ఫ్లోలా ముందుకెళ్తోంది. వాస్తవానికి ఈ టెక్నిక్‌తో సిక్సర్లు కొడుతుంటారు. కానీ వైభవ్ ఆ టెక్నిక్‌ని ఈజీగా వాడేస్తున్నాడు. వయసులో చిన్నవాడే అయినా.. అతను షాట్ కొడుతున్న తీరు టీమ్‌మేట్స్‌ను ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. ఆర్సబీతో మ్యాచ్‌లో సూర్యవంశీకి తోడుగా ద్రువ్ జురెల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సూర్యవంశీ షాట్ కొడుతున్నట్లు తీరు తనను ఆకట్టుకుంటోందని మ్యాచ్ తర్వాత ద్రువ్ తెలిపాడు. అతన్ని చూస్తుంటే మనకేమీ అర్థం కాదు అని జురెల్ తెలిపాడు. మీ కండ్లను మీరే నమ్మలేరు, ఇది నిజం, ఎందుకంటే అసలు ఎలా ఆ బంతిని కొట్టాడో అర్థం కాదు, అదే వికెట్‌పై తాను ఆడుతున్నా, అలాంటి షాట్ మనం ఆడలేమని, వైభవ్ ట్యాలెంట్ మరో లెవల్లో ఉందని ద్రువ్ తెలిపాడు.
ప్రతి ప్లేయర్ సూర్యవంశీని ఇష్టపడుతారని, అతని చుట్టే తిరుగుతంటారని కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. నెట్స్‌లో అతను బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడుతాడని, అతనికి నచ్చింది ఇచ్చేందకు ప్రయత్నిస్తుంటామన్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సూర్యవంశీ కేవలం 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ అతని బ్యాటింగ్ ఎనర్జీ అంతు చిక్కని మిస్టరీలా ఉంది. శుక్రవారం ఆర్సీబీ విసిరిన 202 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రాజస్థాన్ జట్టు ఏమాత్రం ఇబ్బందిపడలేదు. ఓపెనర్ సూర్యవంశీ 26 బంతుల్లో 78 రన్స్ చేసి విజయాన్ని సుస్థిరం చేశాడు. 300 స్ట్రయిక్‌రేట్‌తో అతను వీరబాదుడు బాదాడు. అతన్ని ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 8 బౌండరీలు ఉన్నాయి.
పవర్‌ప్లే కండీషన్స్‌ను వైభవ్ వాడుకుంటున్న తీరు ప్రత్యర్థులను కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తోంది. మొదటి ఆరు ఓవర్లకు వర్తించే పవర్‌ప్లే ఆప్షన్‌ను.. సూర్యవంశీ తన స్ట్రోక్ ప్లే కోసం అద్భుతంగా వినియోగిస్తున్నాడు. సిక్సర్లతో విరుచుకుపడుతున్న అతనికి పవర్‌ప్లే కండీషన్స్ చాలా సూటబుల్‌గా మారాయి. 30 యార్డ్స్ సర్కిల్ మాత్రమే కాదు.. వైభవ్ బంతిని ఈజీగా బౌండరీ లైన్ దాటించేస్తున్నాడు. బంతి బ్యాట్‌కు తగిలితే అది సిక్సరే అన్న రీతిలో సూర్యవంశీ కొడుతున్న తీరు బౌలర్లను తికమకపెడుతోంది. బౌలర్ ఎవరన్నది చూడను, కేవలం బంతినే చూస్తాను అని చెబుతున్న వైభవ్ ఆ జోరులోనే హిట్టింగ్ చేస్తూ కేక పుట్టిస్తున్నాడు.
ఇక ఆర్సీబీతో ఆడిన వైభవ్ ఇన్నింగ్స్‌పై అనేక మంది ప్రశంసలు కురిపించారు. అతని ఆటతీరుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కామెంట్ చేశారు. వైభవ్ ఓ అరుదైన, అద్భుతమైన ట్యాలెంట్ బ్యాటర్ అని కితాబు ఇచ్చారు. కళ్లు చెదిరే రీతిలో సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తున్నారన్నారు. వైభవ్ ఈ సీజన్లో ఇప్పటికే సీఎస్కేతో 52, జీటీతో 31, ముంబైతో 39 రన్స్ స్కోర్ చేశాడు.