Vaibhav Sooryavanshi | ఐపీఎల్లో నయా థౌజండ్‌వాలా.. వైభవ్ ఖాతాలో మరో మైలురాయి..!
Vaibhav Sooryavanshi : వీరకొట్టుడుతో ఐపీఎల్ సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) మరో మైలురాయిని అధిగమించాడు. రెండో వేగవంతమైన శతకంతో రికార్డు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు ఈసారి వెయ్యి పరుగుల క్లబ్లో చేరాడు.
Vaibhav Sooryavanshi : వీరకొట్టుడుతో ఐపీఎల్ సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) మరో మైలురాయిని అధిగమించాడు. ఇప్పటికే ఈ లీగ్‌లో రెండో వేగవంతమైన శతకంతో రికార్డు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు ఈసారి వెయ్యి పరుగుల క్లబ్లో చేరాడు. 19వ సీజ్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌లతో బౌలర్లను భయపెడుతున్న వైభవ్.. అత్యంత వేగంగా 1,000 పరుగుల క్లబ్లో చేరాడు.
ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో రికార్డులు కొల్లగొడుతున్న వైభవ్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19వ సీజన్ క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌పై అర్ధ శతకం బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగులు మైలురాయిని అధిగమించాడు.
Add this to the list of incredible records to the 1⃣5⃣-year-old’s name 🫡💥
He gets to the milestone in 2️⃣3️⃣ innings!
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/0CvXnyJHqa
— IndianPremierLeague (@IPL) May 29, 2026
హోల్డర్ వేసిన 16వ ఓవర్లో 4, 6, 4 బాదడంతో ఐపీఎల్లో వెయ్యి క్లబ్లో చేరాడీ కుర్రాడు. థౌజండ్వాలాగా అవతరించిన వైభవ్ ఈ లీగ్‌లో మరెవ్వరికీ సాధ్యమవ్వని రికార్డు పట్టేశాడు. అత్యంత తక్కువ మ్యాచుల్లోనే వెయ్యి కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత సొంతం చేసుకున్నాడు. అంతేకాదు 440 బంతుల్లో వెయ్యి బాదిన తొలి ఆటగాడు వైభవే కావడం విశేషం.
He only gets more clutch with each game 😎🩷
Vaibhav Sooryavanshi with 🔙 to 🔙 fifties in the playoffs 👏
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/173szb4Rwp
— IndianPremierLeague (@IPL) May 29, 2026
ఐపీఎల్లో వేగంగా వెయ్యి..
షాన్ మార్ష్ – 21 ఇన్నింగ్స్‌ల్లో
లెండిల్ సిమన్స్ – 23 ఇన్నింగ్స్‌ల్లో
వైభవ్ సూర్యవంశీ – 23 ఇన్నింగ్స్‌ల్లో
డెవాన్ కాన్వే – 24 ఇన్నింగ్స్‌ల్లో
మాథ్యూ హేడెన్ – 25 ఇన్నింగ్స్‌ల్లో
సాయి సుదర్వన్ – 25 ఇన్నింగ్స్‌ల్లో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

