Junior Hockey World Cup | డిసెంబర్లో జూనియర్ హాకీ వరల్డ్ కప్.. భారత కెప్టెన్‌గా ఉత్తమ్ సింగ్
Junior Hockey World Cup : భారత పురుషుల హాకీ జట్టు మరో కీలక టోర్నీకి సన్నద్ధమవుతోంది. మలేషియా వేదికగా జరిగే జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొననుంది. ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుకు ఫార్వర్డ్ ప్లేయర్ ఉత్తమ్ సింగ్(Uttam Singh) కెప్టెన్‌గా...
Junior Hockey World Cup : భారత పురుషుల హాకీ జట్టు మరో కీలక టోర్నీకి సన్నద్ధమవుతోంది. మలేషియా వేదికగా జరిగే జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొననుంది. ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుకు ఫార్వర్డ్ ప్లేయర్ ఉత్తమ్ సింగ్(Uttam Singh) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అరాయ్జీత్ సింగ్ హుందల్(Araijeet Singh Hundal) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
డిసెంబర్ 5 నుంచి 16వ తేదీ వరకు కౌలలంపూర్(Kuala Lumpur)లో ఈ పోటీలు జరుగనున్నాయి. ఇద్దరు గోల్ కీపర్లతో కలిపి మొత్తం 20 మందితో కూడిన బృందాన్ని మంగళవారం హాకీ ఇండియా ప్రకటించింది. ‘మాకు పటిష్టమైన స్క్వాడ్ ఉంది. 2016 జూనియర్ వరల్డ్ కప్ గెలిచిన జట్టును స్ఫూర్తిగా తీసుకుని బరిలోకి దిగబోతున్నాం. మా ఏకైక లక్ష్యం ట్రోఫీ సాధించడమే. అందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని కోచ్ సీ.ఆర్. రమేశ్ వెల్లడించాడు.
భారత జట్టు స్క్వాడ్ ఇదే
గోల్ కీపర్లు : మోహిత్ హెచ్ఎస్, రణ్విజయ్ సింగ్ యాదవ్.
డిఫెండర్లు : శారదానంద్ తివారీ, అమన్‌దీప్ లక్రా, రోహిత్, సునీల్ జోజో, అమిర్ అలీ.
మిడ్ ఫీల్డర్స్ : విష్ణుకాంత్ సింగ్, పూవన్న సీబీ, రాజిందర్ సింగ్, అమన్‌దీప్, అదిత్యా సింగ్.
ఫార్వర్డ్స్ : ఉత్తమ్ సింగ్(కెప్టెన్), ఆదిత్యా లలాగే, అరాయ్జీత్ సింగ్ హుందల్(వైస్ కెప్టెన్), సౌరభ్ ఆనంద్ కుశ్వహ, సుదీప్ చిర్మకో, బాబీ సింగ్ ధామి.
రిజర్వ్ ప్లేయర్స్ : సుఖ్విందర్, సునిత్ లక్రా.
ఆసియా చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు గ్రూప్ సిలో ఉంది. కెనడా, దక్షిణ కొరియా, స్పెయిన్ ఇదే గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి. డిసెంబర్ 5న జరిగే తొలి పోరులో భారత్ బలమైన కొరియాతో తలపడనుంది. ఆ తర్వాత డిసెంబర్ 7న స్పెయిన్, డిసెంబర్ 9న కెనడాను ఢీకొననుంది. నిరుడు ఎడిషన్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్ ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక గ్రూప్ ఏలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, మలేషయా ఉన్నాయి. గ్రూప్ బిలో ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా, గ్రూప్ డిలో బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
-
Samantha | బాత్‌టబ్‌లో సమంత షాకింగ్ షో.. ఫొటోలు వైరల్
-
Elon Musk | కేంద్ర మంత్రికి క్షమాపణలు చెప్పిన ఎలాన్ మస్క్
-
World Cup 2023 | వాంఖడేలో భారత్, న్యూజిలాండ్ సెమీస్ ఫైట్.. ప్రత్యేక అతిథిగా ఫుట్‌బాల్ దిగ్గజం..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

