న్యూయార్క్: ఫిఫా వరల్డ్కప్(Fifa World Cup)ను అక్రమ రీతిలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సుమారు 400 వెబ్సైట్లను అమెరికా సీజ్ చేసింది. ఆ డొమెయిన్లను గుర్తించినట్లు అమెరికా న్యాయ శాఖ తెలిపింది. సాకర్ సంఘం ఫిఫాతో పాటు ఇతర ఏజెన్సీలు ఆ అక్రమ వెబ్సైట్లను గుర్తించినట్లు న్యాయశాఖ పేర్కొన్నది. ఎన్బీసీ యూనివర్సల్ తో పాటు వార్నర్ బ్రదర్స్ కూడా సహకరించినట్లు చెప్పింది. అంతర్జాతీయ నెట్వర్క్ల ఆదాయానికి గండి కొట్టే ఉద్దేశంతోనే అక్రమ వెబ్సైట్లు నిర్వహణ జరిగినట్లు అమెరికా న్యాయశాఖ అభిప్రాయపడింది. కాపీరైట్ చట్టాలను ఆ వెబ్సైట్లు ఉల్లంఘించినట్లు కోర్టు పేర్కొన్నది. ఇంటర్నేషనల్ కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నెట్వర్క్లో శిక్షణ పొందిన అధికారులు వివిధ దేశాల్లోనే వెబ్సైట్లను గుర్తించారు. వరల్డ్కప్ మ్యాచ్లకు చెందిన అక్రమ స్ట్రీమింగ్ సర్వర్లు, డొమెయిన్లను టార్గెట్ చేశారు. పెరూ, బల్గేరియా దేశాల్లో ఆ సర్వర్లు, డొమెయిన్లు ఉన్నట్లు గుర్తించారు. ఆన్లైన్ పైరసీకి చెందిన ఆ రెండు కేంద్రాలపై నజర్ పెట్టారు. క్రొయేషియా, రొమేనియా, పోలాండ్, కొలంబియా దేశాల్లోనూ హ్యాకింగ్ ప్రదేశాలను గుర్తించారు.