న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. టాప్ సీడ్ ప్లేయర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్, రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ అలవోక విజయం సాధించింది. ఆదివారం పోరులో తొమ్మిదో సీడ్ వొండ్రుసోవా 6-2, 6-1తో అలెగ్జెండ్రోవాను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
జాబుర్ 5-7 (7-6 (7/5), 6-3తో బుజుకోవాపై నెగ్గగా.. పెగులా 6-4, 4-6, 6-2తో స్వితోలినాను మట్టికరిపించి ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో జ్వెరెవ్ 6-7 (2/7), 7-6 (10/8), 6-1, 6-1తో దిమిత్రోవ్‌పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు హోరోహారీగా సాగగా.. మలి రెండు సెట్లలో జ్వెరెవ్ విజృంభించాడు. రుబ్లెవ్, సిన్నెర్, మెద్వెదెవ్ కూడా ముందంజ వేశారు.