UPW vs GG : మహిళల ప్రీమియర్ లీగ్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న యూపీ వారియర్స్ ఓపెనర్లను కోల్పోయింది. ఓపెనర్లు అలిసా హేలీ (7), శ్వేతా షెరావత్ ఒకే ఓవర్లో ఔట్ అయ్యారు. కిమ్ గార్త్ ఓవర్లో తొలి బంతికి ఆమెకే క్యాచ్ ఇచ్చి హేలీ వెనుదిరిగింది. దాంతో, రన్స్ వద్ద ఆ జట్టు మొదటి వికెట్ పడింది. ఆఖరి బంతికి శ్వేతా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కిరణ్ నవ్‌గిరే, తహిలా మెక్‌గ్రాత్ క్రీజులో ఉన్నారు. ఆ జట్టు మూడు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (46) రాణించడంతో ఆ జట్టు అంత స్కోర్ చేయగలిగింది.