భారత్ తరఫున అండర్-19 ప్రపంచకప్ గెలిచిన సారధి ఉన్ముక్త్ చంద్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాలో జరిగే ప్రముఖ టీ20 క్రికెట్ లీగ్.. బిగ్ బ్యాష్ లీగ్లో ఆడిన తొలి భారత పురుష క్రీడాకారుడిగా నిలిచాడు. ఈ 28 ఏళ్ల కుడిచేతివాటం బ్యాటర్.. గతేడాది నవంబరులో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులో చేరాడు.
హోబర్ట్ హర్రికేన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో బీబీఎల్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో 8 బంతులు ఎదుర్కొన్న అతను ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు.