మెల్బోర్న్: ఇంగ్లండ్‌తో మెల్బోర్న్లో జరుగుతున్న మూడవ వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్లు దుమ్మురేపుతున్నారు. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్లు తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేల్లో హెడ్ మూడవ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్ కూడా సెంచరీ దిశగా వెళ్తున్నాడు. 32 ఓవర్లలో ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 206 రన్స్ చేసింది. హెడ్ 114, వార్నర్ 83 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ .. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో కొనసాగుతోంది.