Ferran Torres : ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో మెరుపు గోల్‌తో ఓవర్‌నైట్‌లో స్టారయ్యాడు ఫెర్రాన్ టోరెస్ (Ferran Torres). న్యూజెర్సీ మైదానంలో లియోనల్ మెస్సీ (Lionel Messi) సారథ్యంలోని అర్జెంటీనాను సమర్ధంగా నిలువరించిన స్పెయిన్‌కు 106వ నిమిషంలో స్టన్నింగ్ గోల్‌తో చిరస్మరణీయ విజయం కట్టబెట్టాడు టోరెస్. మ్యాచ్ అనంతరం పట్టలేనంత సంతోషంలో మునిగిపోయిన ఈ కుర్రాడు.. వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్ విజయం నక్షత్రాల్లో రాసి పెట్టి ఉందని పేర్కొన్నాడు.
ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో సబిస్టిట్యూట్‌గా వచ్చిన ఫెర్రాన్ టోరెస్ స్పెయిన్‌ను గెలిపించాడు. అదనపు సమయంలో మైదానంలోకి వస్తూనే సంచలన గోల్‌తో వరసగా రెండో ట్రోఫీ గెలవాలనుకున్న అర్జెంటీనా కలల్ని ఛిద్రం చేశాడీ కుర్రాడు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ గోల్ కొట్టిన టోరెస్.. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనయ్యాడు.
Ferran Torres wins the world cup for Spain 1-0 🇪🇸 pic.twitter.com/OY5G7w9dCj
— Crazy Clips (@crazyclipsonly) July 19, 2026
‘ఈ ట్రోఫీ నా ఒక్కడిది.. ఇక్కడున్న 26 మందిది కాదు. మా దేశంలోని 47 (4.7కోట్లు) మిలియన్ల మందికి చెందుతుంది. ఈ రోజు ఫలితం ముందుగానే నక్షత్రాల్లో రాసి ఉందని నేను నమ్ముతున్నా. మేము గెలవడానికే ఫైనల్ ఉంది. మా దేశ ప్రజలకు దూరంగా ఉన్నా.. వారు మాతో పాటు ఇక్కడే ఉన్నట్టుగా చేశాం. అన్ని ఫైనల్స్ కష్టమైనవే. అలాంటిది అవతల మెస్సీ ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టు నీరసిస్తుంది. అయితే.. మేము మా బ్రాండ్ ఆటను నమ్ముకున్నాం. ఈరోజు ఆదే ఆట ఆడి చూపించాం’ అని టోరెస్ పేర్కొన్నాడు.
Ferran Torres is the MVP of the World Cup Final ⭐️
📸 @FIFAWorldCup pic.twitter.com/ASTzwFHuI9
— FC Barcelona (@FCBarcelona) July 19, 2026