Novak Djokovic | జకోవిచ్‌కు షాకిచ్చిన 123వ ర్యాంకర్.. కొత్త ఏడాది కలిసి రావట్లేదా..?
Novak Djokovic : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు పెద్ద షాక్ తగిలింది. ఇండియన్ వెల్స్(Indian Wells 2024) టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో జకో.. 123వ ర్యాంకర్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. మంగళవారం లుకా నర్దీ(Luca Nardi)తో జరిగిన మ్యాచ్‌లో..
Novak Djokovic : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు పెద్ద షాక్ తగిలింది. ఇండియన్ వెల్స్(Indian Wells 2024) టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో జకో.. 123వ ర్యాంకర్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. మంగళవారం లుకా నర్దీ(Luca Nardi)తో జరిగిన 32వ రౌండ్ మ్యాచ్‌లో ఈ స్టార్ ఆటగాడు తేలిపోయాడు. వరుసగా మూడు సెట్లలో గట్టి పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించాడు. రెండో సెట్ గెలిచినప్పటికీ ఇటలీ కుర్రాడి ధాటికి 4-6, 6-3, 3-6తో మ్యాచ్ కోల్పోయాడు.
దాంతో, ఏటీపీ మాస్టర్స్ 1000, గ్రాండ్‌స్లామ్ స్థాయి టోర్నీలో జకోను ఓడించిన అతి తక్కువ ర్యాంకర్‌గా నర్దీ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఏటీపీ మాస్టర్స్‌లో 11 మ్యాచుల్లో ఓటమన్నదే ఎరుగని జకోకు ఇది తొలి ఓటమి కావడం గమనార్హం. మరో విషయం ఏంటంటే.. చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్‌లో భారత ఆటగాడు సుమిత్ నాగల్ చేతిలో నర్దీ ఓటమి పాలయ్యాడు.
Il momento in cui Luca Nardi ha sconfitto il n°1 del mondo, Novak Djokovic, regalandosi l’accesso agli ottavi di Indian Wells. 🥹pic.twitter.com/dXvZ812vtu
— Quindici Zero 🎾 (@quindicizero) March 12, 2024
సంచలన ఆటతో తనను ఓడించిన నర్దీపై జకో ప్రశంసలు కురిపించాడు. ‘నర్దీ కోల్పోవడానికి ఏమీ లేదు. అందుకనే అతడు చాలా గొప్పగా ఆడాడు. ఈ విజయానికి అతడే అర్హుడు. నేను చాలా చెత్తగా ఆడాను. ఇది నాకు నిజంగా చెడ్డ రోజు అని’ మ్యాచ్ అనంతరం జకోవిచ్ అన్నాడు.

జకోవిచ్ 2023లో వరుస ట్రోఫీలతో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ వీరుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ సెర్బియా స్టార్ అదరగొట్టాడు. అయితే.. సెమీస్‌లో ఇటలీ కెరటం జన్నిక్ సిన్నర్(Jannik Sinner) చేతిలో అనూహ్యంగా కంగుతిన్నాడు. ఆ తర్వాత ఇండియన్ వెల్స్‌లో టైటిల్ కొట్టేలా కనిపించాడు. కానీ, 20 ఏండ్ల కుర్రాడు నర్దీ తన అసమాన పోరాటంతో జకోవిచ్ జైత్రయాత్రకు తెరదించాడు.
ఇవి కూడా చదవండి
- Kodali Nani | ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన చంద్రబాబు : కొడాలి నాని
- Air Force Aircraft: రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం
- MLA Vivek | జర్నలిస్ట్ వెంకటేశ్‌పై ఎమ్మెల్యే వివేక్ అనుచరుల దాడి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

