ఆక్లాండ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్(NZ vs SA)లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 136 రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ కేవలం 16.2 ఓవర్లలో టార్గెట్‌ను అందుకున్నది. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను 63 రన్స్ చేశాడు. తొలి వికెట్‌కు డేవాన్ కాన్వేతో కలిసి 96 పరుగులు జోడించారు. కాన్వే 39 పరుగులు చేయగా, లాథమ్ టీ20ల్లో నాలుగవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో 22 బంతులు మిగిలి ఉండగానే కివీస్ విజయాన్ని అందుకున్నది. దీంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 2-1 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది. కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. చాలా కట్టుదిట్టంగా అతను బౌలింగ్ చేసి 4 ఓవర్లలో ఒక వికెట్ తీసి కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బెస్ట్ బౌలింగ్ చేసిన ఫెర్గూసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.