Olympic Medal: ఒలింపిక్ గోల్డ్ మెడల్‌ను కొరికిన మేయర్.. అథ్లెట్‌కు మరో పతకం

నగోయ: ఒలింపిక్స్‌లో మెడల్ ( Olympic Medal ) అందుకున్న తర్వాత అథ్లెట్ల ఆ మెడల్స్‌ను కొరకడం సహజం. కానీ తాజాగా కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షల ప్రకారం పతకాలను నోట్లో పెట్టి కొరకరాదు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో సాఫ్ట్‌బాల్ ఈవెంట్లో జపాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది. నగోయ సిటీకి చెందిన అథ్లెట్ మియూ గోటో ఓ కార్యక్రమంలో తన మెడల్‌ను స్థానిక మేయర్‌కు అందజేసింది. ఆ క్షణంలో ఉద్వేగానికి లోనైన మేయర్ టకాషి కవామురా .. తొందరపాటులో ఆ బంగారు పతకాన్ని నోట్లో పెట్టి కొరికేశారు. దీంతో ఆన్లైన్లో ఆ మేయర్‌కు వ్యతిరేకంగా ప్రచారం సాగింది. మేయర్ టకాషి కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన పట్ల ఒలింపిక్స్ అధికారులు స్పందించారు. గోటో అందుకున్న మెడల్ స్థానంలో మరో కొత్త మెడల్‌ను ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు. అయితే పతకాన్ని కొరికిన ఘటన పట్ల మేయర్ టకాషి క్షమాపణలు చెప్పారు. మేయర్ వ్యవహరించిన తీరును జపాన్‌కు చెందిన ఇతర అథ్లెట్లు కూడా ఖండించారు. 72 ఏళ్ల మేయర్ ప్రవర్తన సరిగా లేదని సుమారు ఏడు వేల ఫిర్యాదులు వచ్చాయి. మేయర్ అన్న స్థానాన్ని మరిచి ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని, అయితే రీప్లేస్మెంట్ మెడల్ కోసం తానే మొత్తం ఖర్చును పెట్టుకోనున్నట్లు ఆ మేయర్ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

