IND vs NZ | కివీస్ కాస్కో.. ధర్మశాలలో నేడు భారత్‌తో పోరు
IND vs NZ |మెగాటోర్నీలో భారత్, న్యూజిలాండ్ సండే బ్లాక్‌బస్టర్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ప్రపంచకప్‌లో ఎదురన్నదే లేకుండా అజేయంగా దూసుకెళుతున్న ఇరు జట్లు కత్తులు దూసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి.
IND vs NZ | ధర్మశాల: ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. ఓటమన్నది ఎరుగకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ దూసుకెళుతున్న భారత్, న్యూజిలాండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. హిమాలయ పర్వత శ్రేణుల్లో ధర్మశాల వేదికగా ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. సొంతగడ్డపై మెగాటోర్నీ ఆడుతున్న రోహిత్‌సేన..కివీస్ రెక్కలు విరిచి నాలుగేండ్ల క్రితం తమకు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది.
మెగాటోర్నీలో భారత్, న్యూజిలాండ్ సండే బ్లాక్‌బస్టర్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ప్రపంచకప్‌లో ఎదురన్నదే లేకుండా అజేయంగా దూసుకెళుతున్న ఇరు జట్లు కత్తులు దూసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. ఆదివారం రెండు జట్ల కీలక పోరు జరుగనుంది. గెలిచిన జట్టు సెమీస్ బెర్తుకు మరింత చేరువయ్యే అవకాశముంది. తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను చిత్తుచేసి ఆపై అఫ్గానిస్థాన్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన రోహిత్‌సేన..కివీస్ భరతం పట్టేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. కొట్టిన పిండిల్లాంటి సొంత పిచ్‌లపై తమ సత్తాచాటేందుకు టీమ్ఇండియా క్రికెటర్లు ఆసక్తితో ఉన్నారు. అటు బౌలర్లతో పాటు బ్యాటర్లు మంచి టచ్‌లో ఉండటం భారత్‌కు సానుకూల అంశం కానుంది. బుమ్రా సారథ్యంలో సిరాజ్, శార్దూల్ పేస్ దళం వికెట్ల వేట కొనసాగిస్తుంటే కుల్దీప్, జడేజా తమ స్పిన్ తంత్రాన్ని ప్రయోగిస్తూ విజయాల్లో కీలకమవుతున్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే..కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, కేఎల్ రాహుల్, గిల్, శ్రేయాస్ అయ్యర్ పరిస్థితులకు తగ్గట్లు బ్యాట్లు ఝులిపిస్తున్నారు. సమిష్టి ప్రదర్శన కనబరిస్తే టీమ్ఇండియాకు మరో విజయం చేరినట్లే.
సూర్యకుమార్‌కు గాయం
హార్డ్‌హిట్టర్ సూర్యకుమార్‌కు గాయమైంది. శనివారం నెట్ ప్రాక్టీస్‌లో త్రోడౌన్స్ స్పెషలిస్టు వేసిన బంతి సూర్య కుడిచేతి మణికట్టును బలంగా తాకింది. ఇషాన్‌కు తేనెటీగ కుట్టడంతో ఇబ్బంది పడ్డాడు.
జట్ల అంచనా
భారత్: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, జడేజా, సూర్యకుమార్/ఇషాన్, శార్దుల్/షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్
న్యూజిలాండ్: లాథమ్(కెప్టెన్), కాన్వె, యంగ్, రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్, చాప్మన్, సాంట్నర్, హెన్రీ, ఫెర్గుసన్, బౌల్ట్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

