TNPL | మురళీ విజయ్‌కు చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. దండం పెట్టి వేడుకున్న స్టార్ ప్లేయర్
భారత వెటరన్ ఓపెనర్, టెస్టు స్పెషలిస్ట్ మురళీ విజయ్‌కు ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) ఆడుతున్న అతన్ని ఆటపట్టిస్తూ దుమ్ముదులిపేశారు. ఇటీవల జరిగిన టీఎన్‌పీఎల్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌కు వచ్చాడు విజయ్. అతన్ని చూసిన ప్రేక్షకులు పెద్దగా ‘‘డీకే.. డీకే..’’ అంటూ అరవడం మొదలు పెట్టారు.
దీంతో ఇబ్బందికి గురైన విజయ్.. వెనక్కు తిరిగి ప్రేక్షకులకు దండం పెట్టాడు. ప్రేక్షకులు ఇలా చేయడానికి పెద్ద కారణమే ఉంది. ప్రస్తుతం క్రీడాలోకం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన దినేష్ కార్తీక్. 37 ఏళ్ల వయసులో భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన ఈ వెటరన్ ప్లేయర్.. టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఇస్తున్నాడు.

ఒకప్పుడు మురళీ విజయ్.. డీకేను మోసం చేశాడు. అతని భార్యతో అఫైర్ పెట్టుకున్నాడు. అంతకుముందు భారత వెటరన్ ఆటగాడు మురళీ విజయ్.. డీకేకు ప్రాణ స్నేహితుడు. ఇద్దరూ ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత భారత జట్టులో కూడా ఇద్దరికీ చోటు దక్కింది. ఈ క్రమంలోనే 21 ఏళ్ల వయసులో తన చిన్ననాటి స్నేహితురాలు నికిత వంజరను డీకే పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత తరచూ డీకే వాళ్ల ఇంటికి వెళ్లడం మొదలు పెట్టిన మురళీ విజయ్.. నికితతో అఫైర్ పెట్టుకున్నాడు. డీకే లేని సమయంలో ఆమెతో సమయం గడిపేవాడు. ఈ నిజం తెలిసిన డీకే షాకయ్యాడు. భార్య మోసం చేయడమే కాకుండా, తన ప్రాణ స్నేహితుడే వెన్నుపోటు పొడవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దీంతో భార్యకు విడాకులిచ్చాడు.

ఈ నేపథ్యంలోనే ఫామ్ కోల్పోయి టీమిండియాలో కూడా చోటు కోల్పోయాడు. విడాకుల సమయంలో నికిత గర్భవతి అని, ఆ బిడ్డకు తనే తండ్రి అని తెలిసిన విజయ్.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే సమయంలో మురళీ విజయ్ టెస్టు స్పెషలిస్టుగా భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. అయితే తర్వాత అతను కూడా ఫామ్ కోల్పోయాడు.
యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటడంతో నెమ్మదిగా ఫేడవుట్ అయిపోయాడు. జీవితంలో ముందడుగు వేసిన దినేష్ కార్తీక్.. 2015లో స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్‌ను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నెమ్మది నెమ్మదిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఈ ఏడాది ఐపీఎల్ అద్భుతంగా రాణించి టీమిండియాలో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.
#TNPL2022 DK DK DK ……
Murali Vijay reaction pic.twitter.com/wK8ZJ84351— Muthu (@muthu_offl) July 7, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

