GT vs MI : పంతొమ్మిదో సీజన్లో ముంబై ఇండియన్స్ రెండో విజయంతో మురిసింది. వరసగా నాలుగు ఓటములనుంచి తేరుకున్న ముంబైకి తిలక్ వర్మ(101 నాటౌట్) సునామీ సెంచరీతో భారీ స్కోరందించగా.. బంతితో అశ్వనీ కుమార్(4-24) గుజరాత్ టైటన్స్ మిడిలార్డర్‌ను కూల్చాడు. ఈ సీజన్లో తొలి వికెట్‌తో బుమ్రా(1-15) గుజరాత్ పతనాన్ని మొదలెట్టగా కుర్రాడు అశ్వన్ వికెట్ల వేటతో ముంబైని గెలిపించాడు. 200 పరుగుల ఛేదనలో పరిమితమైన గుజరాత్‌కు సొంత ప్రేక్షకుల సమక్షంలో భారీ ఓటమి చవిచూసింది.
ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ గెలుపు తోవ తొక్కింది. పంతొమ్మిదో సీజన్లో వరస పరాజయాలకు వీడ్కోలు పలుకుతూ అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించింది. ముంబై నిర్దేశించిన 200 పరుగుల భారీ ఛేదనలో తొలి ఓవర్లోనే గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(0) వికెట్ సాధించాడు బుమ్రా(1-15). ఈ సీజన్లో అతడికిదే మొదటి వికెట్ కాగా.. ప్రమాదకరమైన బట్లర్(5)ను పాండ్యా బోల్తా కొట్టించాడు.
✅ 𝐖 in Ahmedabad
✅ 𝐖 in season opener pic.twitter.com/GjZoaxlZ7N— Mumbai Indians (@mipaltan) April 20, 2026
టాపార్డర్ వైఫల్యంతో షాక్ తిన్న గుజరాత్‌ను అశ్వనీ కుమార్ మరింత దెబ్బ తీస్తూ శుభ్‌మన్ గిల్(14)ను వెనక్కి పంపాడు. శాంట్నర్ ఒకే ఓవర్లో సుందర్(26), డేంజరస్ గ్లెన్ ఫిలిప్స్(6) వికెట్లు తీసి గుజరాత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. టపటపా ఐదు వికెట్లు పడిన వేళ ఇంప్యాక్ట్ సబ్ రాహుల్ తెవాటియా(8), షారుక్ ఖాన్(17)లు ఆశలు రేపారు. కానీ, తెవాటియాను అపై ఒకే ఓవర్లో రషీద్ ఖాన్(4), షారుక్‌లను ఔట్ చేసిన అశ్వనీ కుమార్(4-24) గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. రబడ(12) కాసేపు పోరాడినా సిరాజ్ ఎల్బీగా ఔటవ్వగా గుజరాత్ 100కే కుప్పకూలింది.
That winning feeling 🥳@mipaltan fans, how delighted are you? 😉
Scorecard ▶️ https://t.co/cawFoZABvQ#TATAIPL | #KhelBindaas | #GTvMI pic.twitter.com/7U2ABgTRsK
— IndianPremierLeague (@IPL) April 20, 2026
అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్ ఆరంభంలో తడబడినా గొప్పగా పుంజుకుంది. పవర్ ప్లేలోనే రబడ మూడు వికెట్లతో హడలెత్తించినా కుర్రాళ్లు తిలక్ వర్మ(101 నాటౌట్), నమన్ ధిర్(45)లు దంచేశారు. గుజరాత్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేసిన ఈ ద్వయం కీలక భాగస్వామ్యంతో ముంబైని ఆదుకుంది.
తిలక్ వర్మ(101 నాటౌట్)

నమన్ టయ్యాక మరింత రెచ్చిపోయిన తిలక్ సూపర్ సెంచరీతో భారీ స్కోరందించాడు. ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లో ఫోర్, రెండు సిక్సర్లు బాదిన తెలుగబ్బాయి ఐపీఎల్లో శతకం కొట్టేశాడు. ఫలితంగా గుజరాత్ అడ్డాలో ముంబై భారీస్కోర్తో సవాల్ విసిరింది.