కోల్‌కతా: తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మను వన్డే ప్రపంచకప్ బరిలో దింపాలనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నంది. ఇప్పటికే రవిశాస్త్రి, సందీప్ పాటిల్, ఎమ్మెస్కే ప్రసాద్ ఈ హైదరాబాదీని స్వదేశంలో జరుగనున్న మెగాటోర్నీ కోసం ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తుంటే.. ఇప్పుడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఈ జాబితాలో చేరాడు.
తిలక్‌కు ఎక్కువ అనుభవం లేకున్నా.. అతడిలో ఆ సత్తా ఉందని దాదా అభిప్రాయపడ్డాడు.‘నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల ప్లేయర్లు లేరనడం సరైంది కాదు. చాలా మంది ప్లేయర్లు ఆ స్థానంలో ఆడేందుకు అందుబాటులో ఉన్నారు. అందులో తిలక్ కూడా ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడం అతడికి అదనపు ప్రయోజనం’ అని గంగూలీ అన్నాడు.