Tilak Varma | భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అవుటైన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన స్టంపింగ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంపైర్ తప్పు నిర్ణయం ఇచ్చారంటూ కొందరు అభిమానులు విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు మాత్రం నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు.
ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ వేసిన ఒక బంతిని భారీ షాట్ ఆడేందుకు తిలక్ క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. అయితే బంతిని పూర్తిగా మిస్ కావడంతో అది నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే స్పందించిన బట్లర్ వికెట్లను పడగొట్టాడు. బట్లర్ వికెట్లను పడగొట్టిన వెంటనే బంతి అతని గ్లోవ్స్ నుంచి జారి నేలపై పడింది. దీంతో తిలక్ వర్మ నాటౌట్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి. బంతి చేతిలో లేకుండానే స్టంపింగ్ పూర్తి చేశారని అభిమానులు వాదించారు. అయితే థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన అనంతరం తిలక్ వర్మను అవుట్‌గా ప్రకటించారు. దీంతో కేవలం 11 బంతుల్లో 3 పరుగులు చేసిన తిలక్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఈ ఘటనపై స్పష్టత కోసం క్రికెట్ చట్టాలను పరిశీలిస్తే, ఎంసీసీ (Marylebone Cricket Club) రూపొందించిన నిబంధనల ప్రకారం వికెట్ కీపర్ లేదా ఫీల్డర్ వికెట్లను పడగొట్టే సమయంలో బంతిపై నియంత్రణ కలిగి ఉండాలి. వికెట్లను పడగొట్టే క్షణంలో బంతి కీపర్ చేతిలో లేదా గ్లోవ్స్‌కు నియంత్రణలో ఉండాలి.వికెట్లు పూర్తిగా పడిపోయిన తర్వాత బంతి చేతిలో నుంచి జారిపోయినా ఆ స్టంపింగ్ చెల్లుబాటు అవుతుంది. వికెట్లు పడే సమయానికి బ్యాటర్ క్రీజు బయట ఉంటే అతడిని అవుట్‌గా ప్రకటించవచ్చు.మరి తిలక్ వర్మ విషయంలో ఏం జరిగింది అంటే.. రీప్లేల్లో కనిపించిన దాని ప్రకారం, జోస్ బట్లర్ వికెట్లను తాకే సమయంలో బంతి అతని గ్లోవ్స్‌కు నియంత్రణలోనే ఉంది. వికెట్లు పడిపోయిన తర్వాతే బంతి కింద పడింది. అదే సమయంలో తిలక్ వర్మ కాలు కూడా క్రీజు బయటే ఉండటంతో థర్డ్ అంపైర్ స్టంపింగ్‌ను అవుట్‌గా ప్రకటించారు.
Tilak Varma gone.
India : 61-6/ 7.2 pic.twitter.com/KDwHoOjFnC
— Mandrake (@Mandrakealive) July 7, 2026