ఐపీఎల్ నుంచి ముగ్గురు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఔట్.. కరోనా వల్లేనా?

ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి ఒకేసారి ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ వెళ్లిపోయారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు చెందిన ఇద్దరు, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఒకరు వెళ్లిపోయినట్లు ఆయా ఫ్రాంచైజీలు వెల్లడించాయి. ఆర్సీబీ నుంచి ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ వెళ్లిపోతున్నట్లు ట్విటర్లో చెప్పింది. అటు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ ఆండ్రూ టై ఇప్పటికే ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.
వీళ్లంతా వ్యక్తిగత కారణాల వల్లే వెళ్లిపోయారని ఫ్రాంచైజీలు చెబుతున్నా.. ఇండియాలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటే దీనికి కారణమన్న అనుమానాలు ఉన్నాయి. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇక ఈ సీజన్లో ఆడబోవడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనాతో పోరాడుతున్న కుటుంబానికి అండగా ఉండటాని కంటూ అతడు ఐపీఎల్ నుంచి వెళ్లిపోయాడు.
అయితే ఏ ఫ్రాంచైజీ కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వెళ్లిపోవడానికి కరోనానే కారణమని చెప్పలేదు. ఐపీఎల్ 14వ సీజన్ తొలి 20 మ్యాచ్‌లు చెన్నై, ముంబైలలో జరగగా.. ఇక యాక్షన్ ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు షిఫ్ట్ కానుంది. అయితే కరోనా కేసులు ఢిల్లీని వణికిస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ఐపీఎల్ ఎలా జరుగుతుందన్నది చూడాలి.
Official Announcment:
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 26, 2021
Adam Zampa & Kane Richardson are returning to Australia for personal reasons and will be unavailable for the remainder of #IPL2021. Royal Challengers Bangalore management respects their decision and offers them complete support.#PlayBold #WeAreChallengers pic.twitter.com/NfzIOW5Pwl
AJ Tye flew back to Australia earlier today due to personal reasons. We will continue to offer any support he may need.#RoyalsFamily
— Rajasthan Royals (@rajasthanroyals) April 25, 2021
I would be taking a break from this years IPL from tomorrow. My family and extended family are putting up a fight against #COVID19 and I want to support them during these tough times. I expect to return to play if things go in the right direction. Thank you @DelhiCapitals 🙏🙏
— Ashwin 🇮🇳 (@ashwinravi99) April 25, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

