ఫుట్‌బాలర్‌ను లాక్కెళ్లిన మొసలి.. కాల్పులు జరిపితే కానీ మృతదేహాన్ని వదల్లేదు!
కొస్టారికా ఫుట్‌బాలర్ జీసస్ అల్బర్టో లోపెజ్ ఒర్టిజ్ మృతి క్రీడాభిమానులను కలిచి వేసింది. కానస్ నదిలో సరదాగా ఈతకు వెళ్లిన జీసస్ అల్బర్టోను భారీ మొసలి బలి తీసుకుంది. మొసలి నుంచి తప్పించుకునేందుకు జీసస్ అన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది.
సాన్‌జోస్: కొస్టారికా ఫుట్‌బాలర్ జీసస్ అల్బర్టో లోపెజ్ ఒర్టిజ్ మృతి క్రీడాభిమానులను కలిచి వేసింది. కానస్ నదిలో సరదాగా ఈతకు వెళ్లిన జీసస్ అల్బర్టోను భారీ మొసలి బలి తీసుకుంది. మొసలి నుంచి తప్పించుకునేందుకు జీసస్ అన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. నోట కరుచుకుని జీసస్ ప్రాణాన్ని చిదిమేసిన రాకాసి మొసలి మృతదేహంతో నదిలో కలియతిరుగడం స్థానికులు గమనించారు.
ఎంతకు వదిలి పెట్టకపోవడంతో కాల్పులు జరిపిన స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. గత నెల 29న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డేపోర్టివో రియో కనాస్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 29 ఏండ్ల జీసస్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యువ ఫుట్‌బాలర్ మృతి పట్ల సాకర్ క్లబ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి తామంత అండగా ఉంటామని పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

