పారిస్: అనుభవానికి, యువ రక్తానికి మధ్య జరిగిన పోరులో సెర్బియా వీరుడు జొకోవిచ్‌దే పైచేయి అయింది. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శుక్రవారం మూడో సీడ్ నొవాక్ జొకోవిచ్ 6-3, 5-7, 6-1, 6-1తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్పై విజయం సాధించాడు. ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్ (22)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న జొకోవిచ్..
అతడిని అధిగమించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. రెండున్నర గంటల పాటు సాగిన పోరులో తొలి రెండు సెట్లలో ఇరువురు ఆటగాళ్లు గొప్పగా పోరాడినా.. ఒకసారి లయ దొరకబుచ్చుకున్నాక జొకోవిచ్ వెనుదిరిగి చూసుకోలేదు. పవర్ ఫుల్ సర్వీస్‌లు, కచ్చితమైన నెట్ గేమ్‌తో అల్కరాజ్ ఆట కట్టించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో శనివారం టాప్ సీడ్ స్వియాటెక్‌తో ముచోవా అమీతుమీ తేల్చుకోనుంది.