సెసొన్-సెవిన్యె ఫ్రాన్స్): ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ సింగిల్స్ బరిలో నిలిచిన ఏకైక షట్లర్ ఉన్నతి హుడా సైతం ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టింది.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఉన్నతి.. 14-21, 11-21తో ప్రపంచ రెండో ర్యాంక ర్ వాంగ్ జియి (చైనా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో శివాని-రోహన్ జోడీ.. 23-21, 8-21, 17-21తో గిక్వెల్-డెల్ఫిన్ డెల్రూ (ఫ్రాన్స్) చేతిలో అపజయం పాలైంది.