HCA Elections | హెచ్‌సీఏ ఎన్నికల నగారా.. ఈ నెల 20న ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల
HCA Elections | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు రానే వచ్చాయి. ఎలక్టోరల్ అధికారి వీఎస్ సంపత్..హెచ్‌సీఏ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేశారు.
HCA Elections | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు రానే వచ్చాయి. ఎలక్టోరల్ అధికారి వీఎస్ సంపత్..హెచ్‌సీఏ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేశారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఈ నెల 20వ తేదిన ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుర్తింపు ఉన్న క్లబ్‌లు తమ ప్రతినిధులను మార్చుకునేందుకు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 14వ తేదీన స్క్రూటినీ జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 16 ఆఖరి తేది కాగా అదే రోజు తుది జాబితాను ప్రకటించనున్నారు. దీనికి తోడు హెచ్‌సీఏకు అనుబంధంగా ఉన్న 149 క్లబ్‌లతో పాటు జిల్లాల అసోసియేషన్లు, మాజీ క్రికెటర్ల (పురుషులు, మహిళలు) జాబితాను వీఎస్ సంపత్ మీడియాకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే హెచ్‌సీఏకు సెప్టెంబర్ 2019లో చివరిసారి ఎన్నికలు జరుగగా, మాజీ కెప్టెన్ అజారుదీన్ నేతృత్వంలో ప్యానెల్ కొలువుదీరింది. అయితే అజర్ అధ్యక్ష పదవీకాలం సెప్టెంబర్ 2020లోనే ముగిసింది. హెచ్‌సీఏలో నెలకొన్న అవినీతి ఆరోపణలు, బహుళ క్లబ్‌ల ప్రాతినిధ్యంపై సుప్రీం కోర్టు జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

