ఫైనల్లో అల్కారజ్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ నయా బుల్ కార్లోస్ అల్కారజ్ తొలిసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు.
- సెమీస్‌లో సిన్నర్‌పై అద్భుత విజయం
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ నయా బుల్ కార్లోస్ అల్కారజ్ తొలిసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అల్కారజ్ 2-6, 6-3, 3-6, 6-4, 6-3తో ఇటలీ ప్లేయర్ జానిక్ సిన్నర్‌పై అద్భుత విజయం సాధించాడు. 4 గంటల తొమ్మిది నిమిషాల పాటు సాగిన పోరులో అల్కారజ్ తనదైన పోరాట పటిమ ప్రదర్శించాడు. మైదానంలో ఓవైపు శారీరక సమస్యలతో ఇబ్బందులు ఎదురైనా వెరువకుండా..రెండో సీడ్ సిన్నర్‌కు దీటైన పోటీనిచ్చాడు.
తొలి సెట్‌ను సిన్నర్‌కు చేజార్చుకున్న అల్కారజ్ రెండో సెట్ గెలిచి పోరుకు సై అన్నాడు. అయితే తానేం తక్కువ కాదన్న రీతిలో సిన్నర్ కూడా చెలరేగి మూడో సెట్ కైవసం చేసుకోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. తన శక్తినంతా కూడదీసుకుంటూ చెలరేగిన అల్కారజ్ వరుసగా రెండు సెట్లతో పాటు మ్యాచ్‌ను తన కైవసం చేసుకున్నాడు.
ఈ పోరులో అల్కారజ్ ఎనిమిది ఏస్‌లు కొడితే..సిన్నర్ ఏడు సంధించాడు. 65 విన్నర్లతో అల్కారజ్ అదరగొట్టగా, సిన్నర్ 39కే పరిమితమయ్యాడు. 58 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడిన స్పెయిన్ స్టార్ మ్యాచ్‌ను నిలబెట్టుకోగలిగాడు. తద్వారా మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్ చేరిన పిన్న వయసు(21) ప్లేయర్‌గా అల్కారజ్ నిలిచాడు. జ్వెరెవ్, కాస్పర్ రూడ్ మధ్య మరో సెమీస్ విజేతతో అల్కారజ్ తుదిపోరులో తలపడుతాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

