అస్తానా : ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో 11వ గేమ్ డ్రాగా ముగిసింది. ఈ పోరులో ఇది వరుసగా నాలుగో డ్రా. ఆదివారం జరిగిన తాజా పోరులో గంట 40 నిమిషాలకు 39 ఎత్తుల అనంతరం గ్రాండ్‌మాస్టర్లు నెపోమ్నియాషి, డింగ్ లిరెన్ గేమ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. దీనితో ఇప్పటికీ నెపోమ్నియాషి ఒక పాయింట్ ఆధిక్యం (6-5)లో కొనసాగుతున్నాడు.
నెపోమ్నియాషి 2, 5, 7 గేమ్‌లను గెలుచుకోగా, డింగ్ లిరెన్ 4,6 గేమ్‌లలో విజయం సాధించాడు. తతిమా గేమ్‌లు డ్రాగా ముగిశాయి.