Sania Mirza | ఇంటి నేమ్‌ప్లేట్ మార్చేసిన సానియా మీర్జా.. ఎవరి పేరు యాడ్ చేసిందంటే..?
Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ (Tennis Star) సానియా మీర్జా (Sania Mirza) ఇటీవలే భర్త నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరుపేసుకుంటూ లైఫ్‌ను కొత్తగా మొదలెట్టింది.
Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ (Tennis Star) సానియా మీర్జా (Sania Mirza) ఇటీవలే భర్త నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తన పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరుపేసుకుంటూ లైఫ్‌ను కొత్తగా మొదలెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇంటి నేమ్ ప్లేట్‌ను (Nameplate) కూడా మార్చేసింది. తన పేరు పక్కన కుమారుడు ఇజాన్ పేరు ఉండేలా ‘సానియా ఇజాన్’ (Sania and Izhaan) అంటూ నేమ్ ప్లేట్‌ను తయారు చేయించుకుని ఇంటి ముందు తగిలించేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సానియా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, దాయాదిదేశమైన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. 2018లో ఈ దంపతులకు ఓ కుమారుడు (ఇజాన్) జన్మించాడు. అయితే, ఇటీవలే వీరు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత షోయబ్ ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. పాకిస్థాన్ ప్రముఖ సినీతారగా గుర్తింపు పొందిన సనా జావెద్‌ను ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకొని అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక సానియా మాత్రం కుమారుడితో ఒంటరిగానే ఉంటోంది.
Also Read..
Anant Weds Radhika | ఇటలీ టు స్విట్జర్లాండ్.. భారీ క్రూయిజ్‌లో అనంత్ వివాహం
Garudan Movie | మాస్ అవతార్‌లో తమిళ హీరో సూరి.. ఇంట్రెస్టింగ్గా ‘గరుడన్’ ట్రైలర్
FSSAI: ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా శ్యాంపిళ్లలో ఇథిలిన్ ఆక్సైడ్ ఆనవాళ్లు లేవు: ఎఫ్ఎస్ఎస్ఏఐ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

