Anant Weds Radhika | ఇటలీ టు స్విట్జర్లాండ్.. భారీ క్రూయిజ్‌లో అనంత్ వివాహం
Anant Weds Radhika | అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) ఓ ఇంటివాడు అవుతున్న విషయం తెలిసిందే.
Anant Weds Radhika | అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ – నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) ఓ ఇంటివాడు అవుతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్ (Radhika Merchant)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. గుజరాత్ జామ్ నగర్లో జరిగిన ఈ వేడుకలకు దేశ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఇప్పుడు వీరి పెళ్లికి అంబానీ ఫ్యామిలీ ముహూర్తం పెట్టేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలు పెట్టేశారు.
వీరి వివాహం రెండు దేశాల్లో జరగనుంది. మొదట మే 29వ తేదీన ఇటలీ (Italy)లో పెళ్లి వేడుకలు మొదలుకాగా.. జూన్ 1న స్విట్జర్లాండ్ (Switzerland)లో ముగియనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలు మొత్తం భారీ క్రూయిజ్ షిప్‌లోనే జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌లోని పెద్ద స్టార్స్ కూడా పాల్గొననున్నారు. మొత్తం 300 మంది వీవీఐపీలు ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ మినహా మిగతా అంబానీ ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే అక్కడికి చేరుకొని పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది.
షారుక్ ఖాన్ కుటుంబం, రణబీర్ కపూర్ – అలియా భట్, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా – నిక్ జొనాస్, రణ్వీర్ సింగ్ – దీపిక పదుకొణె, కియారా అద్వాణీ – సిద్ధార్థ్ మల్హోత్ర, సోనమ్ కపూర్ – ఆనంద్ అహూజా సహా పలువురు స్టార్స్ అతిథుల లిస్ట్‌లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడు రోజుల పాటు క్రూయిజ్‌లో జరిగే ఈ పార్టీలో నో ఫోన్ విధానాన్ని అనుసరించనున్నారు. ఈ వేడుకల అనంతరం జూలై 6 నుంచి 12 మధ్య ముంబైలో, ఆ తర్వాత ఢిల్లీలో కూడా వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.
Also Read..
Garudan Movie | మాస్ అవతార్‌లో తమిళ హీరో సూరి.. ఇంట్రెస్టింగ్గా ‘గరుడన్’ ట్రైలర్
Delhi Police: కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ గ్రాఫిటీ.. ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు
KTR | ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం: కేటీఆర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

