Rafael Nadal | టాప్-10 జాబితాలో చోటు కోల్పోయిన నాదల్.. 18 ఏళ్లుగా టాప్-10లో టెన్నిస్ స్టార్
Rafael Nadal | ఇరవై రెండు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ సుదీర్ఘకాలం తర్వాత పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్-10 జాబితాలోంచి చోటు కోల్పోయాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 ఏళ్ల (934 వారాలు) నుంచి టాప్-10లో కొనసాగుతున్న నాదల్.. తాజా ఏటీపీ ర్యాంకింగ్స్లో 13వ ర్యాంకుకు పడిపోయాడు.
న్యూఢిల్లీ: ఇరవై రెండు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ సుదీర్ఘకాలం తర్వాత పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్-10 జాబితాలోంచి చోటు కోల్పోయాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 ఏళ్ల (934 వారాలు) నుంచి టాప్-10లో కొనసాగుతున్న నాదల్.. తాజా ఏటీపీ ర్యాంకింగ్స్లో 13వ ర్యాంకుకు పడిపోయాడు.
రాఫెల్ నాదల్ తొలిసారి 2005 ఏప్రిల్ 25న టాప్-10లో టాప్-10 జాబితాలో ప్రవేశించాడు. అప్పటి నుంచి 2023 మార్చి 20 వరకు ఏకంగా 934 వారాలపాటు టాప్-10 జాబితాలో కొనసాగాడు. దాంతో ఏటీపీ ర్యాంకింగ్స్ చరిత్రలో ఇంత ఎక్కువ కాలం వరుసగా టాప్-10 జాబితాలో కొనసాగిన ఏకైక ఆటగాడిగా నాదల్ నిలిచాడు.
కాగా, నాదల్ 13 ర్యాంకుకు పడిపోవడంతో రెండు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన 19 ఏండ్ల కార్లోస్ అక్లరాజ్ ప్రస్తుతం జాబితాలో అగ్రస్థానంలోకి వెళ్లాడు. నొవాక్ జకోవిక్, స్టెఫనోస్ సిట్సిపాస్, కాస్పర్ రుడ్, డానిల్ మెద్వదేవ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

