ఖమ్మం ;తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యానికి తార్కాణమిది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మించిన టెన్నిస్ కోర్టు ఇది. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో మూడు కోర్టులను సువిశాలంగా తీర్చిదిద్దారు.