హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని.. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణతో మెరిసింది. ఛత్తీస్‌గఢ్ వేదికగా జరుగుతున్న అండర్-23 చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో నందిని 13.73 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో అపర్ణ రాయ్ (13.80 సెకన్లు) పేరిట ఉన్న మీట్ రికార్డును నందిని బద్దలు కొట్టింది. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న నందిని.. ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నది.