హైదరాబాద్, ఆట ప్రతినిధి: కిర్గిస్థాన్ వేదికగా జరుగుతున్న ఆసియా ఓపెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ లిఫ్టర్ కార్తీక్ పసిడి పతకాలతో మెరిశాడు. సోమవారం జరిగిన అండర్-17 యూత్ 75కిలోల విభాగం ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో కార్తీక్ స్వర్ణం, డెడ్‌లిఫ్ట్‌లో పసిడి పతకం సాధించాడు. ఓవరాల్‌గా 370కిలోల బరువెత్తిన కార్తీక్..డెడ్‌లిఫ్ట్‌లో 150కి, స్వాట్‌లో 140కి, బెంచ్‌ప్రెస్‌లో 80కి బరువెత్తి సత్తాచాటాడు. డబ్ల్యూపీసీ తెలంగాణ పవర్‌లిఫ్టింగ్ సంఘం అధ్యక్షురాలు రేఖ, కోచ్ నిఖిల్..కార్తీక్‌ను అభినందించారు.