ఇషా సింగ్ పసిడి గురి
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ అదరగొట్టింది. మిక్స్డ్ టీమ్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరితో జతకట్టిన ఇషా అద్భుత ప్రదర్శనతో 18వ అంతర్జాతీయ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
- జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ అదరగొట్టింది. మిక్స్డ్ టీమ్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరితో జతకట్టిన ఇషా అద్భుత ప్రదర్శనతో 18వ అంతర్జాతీయ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. జర్మనీ వేదికగా జరుగుతున్న షూటింగ్ మెగాటోర్నీలో భారత షూటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. గురువారం జరిగిన మిక్స్డ్ టీమ్ పిస్టల్ ఫైనల్లో ఇషా-సౌరభ్ జంట 16-12 తేడాతో భారత్‌కే చెందిన పాలక్-సరబ్‌జ్యోత్ జోడీని చిత్తు చేసింది. ఇషా-సౌరభ్ స్వర్ణం చేజిక్కించుకోగా.. పాలక్-సరబ్‌జ్యోత్ సింగ్ ద్వయం రజతం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్‌లో రమిత-పార్త్ మఖిజా ద్వయం 13-17 తేడాతో పోలాండ్ జోడీ చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఖాతాలో 10 పతకాలు చేరాయి. స్వర్ణం నెగ్గిన 17 ఏండ్ల ఇషా మొత్తంగా ఇప్పటి వరకు 26 జాతీయ పతకాలను తన ఖాతాలో వేసుకుని సత్తాచాటింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

